తిరుపతి నగరపాలక ఎన్నికల నామినేషన్లలోనూ.... దౌర్జన్యకాండ కొనసాగింది. నామినేషన్ వేయడానికి కేంద్రం వద్దకు వచ్చిన తెలుగుదేశం నాయకులపై... వైకాపా కార్యకర్తలు దాడులకు దిగారు. 13వార్డు తరఫున నామినేషన్ వేసేందుకు వెళ్లిన... ఆనంద్ యాదవ్, కృష్ణయాదవ్‌పై.....వైకాపా కార్యకర్త మోహనకృష్ణ యాదవ్ దాడికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను... చెదరగొట్టారు. ఈక్రమంలోనే రెచ్చిపోయిన వైకాపా నేత మోహన కృష్ణ తెలుగుదేశం నాయకుల నామపత్రాలు చింపేశారు.
పులివెందుల సంస్కృతి తీసుకొచ్చారు...
తిరుపతిలో పులివెందుల సంస్కృతిని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుగుణమ్మ మండిపడ్డారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా సభ్యులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించిన ఆమె....నగరంలోని 9,10,11,12 వార్డుల్లో తెదేపా నేతలను బయటకు నెట్టేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరపాలకసంస్థ కార్యాలయానికి చేరుకున్న సుగుణమ్మ... పోలీసు సిబ్బందిని, అధికారులను వైకాపా నాయకుల దౌర్జన్యాలపై ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా ఎన్నికల పరీశీలకులు సిద్ధార్థ జైన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి...అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడాలి: యనమల