ETV Bharat / city

తితిదే ఆధ్వర్యంలోని 9 సంస్థలకు ఐఎస్​వో గుర్తింపు - ఐఎస్​వో గుర్తింపు

యాత్రికులకు సౌలభ్యంగా, శుభ్రంగా, ఆధునికంగా అందుబాటులో ఉండే సంస్థలకు అందించే ఐఎస్ఓ గుర్తింపును తితిదేకి చెందిన 9 సంస్థలు ఒకే రోజు సాధించాయి.

ఒకే రోజు తితిదే 9 సంస్థలకు ఐఎస్​వో గుర్తింపు
author img

By

Published : May 5, 2019, 6:20 AM IST

తితిదే ఆధ్వర్యంలో నడుస్తున్న 9 సంస్థలకు ఒకే రోజు ఐఎస్​వో గుర్తింపు లభించింది. తిరుపతిలోని మాధవం యాత్రికుల వసతి సముదాయం, శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల, తితిదే అధీనంలోని కుప్పం, రాజాం, నర్సాపురం, తెలంగాణలోని మహబూబ్​నగర్, బెంగళూరులోని తితిదే కల్యాణ మండపాలకు ఐఎస్​ఓ గుర్తింపు లభించిందని జేఈవో బి.లక్ష్మీకాంతం తెలిపారు.
ధ్రువపత్రాలు అందజేత....
ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధ్యక్షతన అన్ని విభాగాల అధికారులు, ఐఎస్​వో ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సంస్థలకు వచ్చిన ధ్రువపత్రాలను ఈవో, జేఈవోలు అందుకున్నారు.
మొత్తం 10... ఇదో రికార్డు...
గతంలో విష్ణువాసం వసతి సముదాయం ఐఎస్​వో గుర్తింపు సాధించింది. అన్నీ కలిపి తితిదే పరిధిలోని 10 సంస్థలు గుర్తింపు సాధించినట్లయింది. ఈ ఘనత ఓ రికార్డని అధికారులు చెబుతున్నారు.
అన్ని అంశాలు పరిగణలోకి...
ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అధికారులు పలుమార్లు తితిదే సంస్థలను పరిశీలించారని జేఈవో లక్ష్మీకాంతం తెలిపారు. ఉన్నత నాణ్యతా ప్రమాణాలు పాటించటం వల్లనే ఈ గుర్తింపు దక్కిందన్నారు. సిబ్బంది యూనిఫాం, గుర్తింపు కార్డుల ధరింపు, భక్తులకు సౌకర్యాలు, విద్యుత్తు, నీటి సరఫరా, బెడ్ షీట్లు, పిల్లో కవర్ల మార్పు, పెయింటింగ్, ఫర్నీచర్, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యం, మౌలికసదుపాయాల వంటి ఎన్నో అంశాలను ఐఎస్​వో ప్రతినిధులు పరిగణలోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.

ఒకే రోజు తితిదే 9 సంస్థలకు ఐఎస్​వో గుర్తింపు

ఇవీ చూడండి-కేజ్రీవాల్​పై దాడితో.. 'వారి ఓటమి' ఖాయమైపోయింది!

Intro:అవయవదానం వ్యాపారం

Body:అవయవదానం వ్యాపారం

Conclusion:అవయవదానం వ్యాపారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.