తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి వాహనసేవను తితిదే వైభవంగా నిర్వహించింది. కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్పస్వామి వారు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై అభయ ప్రదానం చేశారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వాహనసేవలో పాల్గొన్నారు.
వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ.. పండితులు స్వామి వారికి కర్పూర, పూర్ణకుంభ హారతులను సమర్పించారు. రంగనాయకుల మండపంలో ఆస్థానాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈరోజు ఉదయం నిర్వహించే చక్రస్నాన కార్యక్రమంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఇదీ చదవండి: పెరిగిన భూగర్భ జలాల మట్టం... బోరుబావిలో పొంగుతున్న నీరు