ETV Bharat / city

ttd darshan: శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

http://10.10.50.85:6060/reg-lowres/05-September-2021/ap_tpt_02_05_vips_at_darshan_avbb_ap10014_0509digital_1630808825_717.mp4

author img

By

Published : Sep 5, 2021, 10:21 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ బీటెక్ రవి, తెలంగాణ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, కాకతీయ 22వ రాజు కమల్ చంద్ర భంజ్ జియో.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే ఆధికారులు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని.. ప్రభుత్వం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు టెండర్లు వేయక ఆలస్యమవుతోందని ఎమ్మెల్యే వరప్రసాద్ తెలిపారు. కరోనా ప్రభావం తగ్గి పుర్వ పరిస్థితులు నెలకొనాలని శ్రీవారిని ప్రార్థించినట్లు కాకతీయ 22వ రాజు కమల్ చంద్ర తెలిపారు.

హుండీ ఆదాయం రూ.2.25కోట్లు

శనివారం శ్రీవారిని 24,568 మంది భక్తులు దర్శించుకున్నారు. 13,088 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.25 కోట్లు సమకూరింది.

ఇదీ చదవండి: teachers day:గురుశిష్యులు బంధం.. అమోఘం..అద్వితీయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.