సప్తగిరి మాసపత్రిక వివాదంలో ఇద్దరు తితిదే ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేశారు. రామాయణాన్ని వక్రీకరిస్తూ కుశుడు పేరుతో ఏప్రిల్ సంచికలో కథనం ప్రచురించినందుకు సంపాదకుడు, ఉప సంపాదకుడుపై చర్యలు తీసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే సప్తగిరి మాస పత్రిక ఏప్రిల్ ఎడిషన్లో రామాయణానికి సంబంధించి కుశుడు పేరుతో వేసిన కథనం విమర్శలకు దారి తీసింది. రామాయణాన్ని వక్రీభాష్యం చెప్పారంటూ దీనిపై రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఉద్యోగులపై అధికారులు వేటు వేశారు.
ఇవీ చదవండి:
ఏవీ సుబ్బారెడ్డి హత్యాయత్నం కేసులో అఖిలప్రియ భర్తకు నోటీసులు