మండలిలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యానికే తలవంపులని... ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు పేర్కొన్నారు. నిబంధనలకు లోబడి తమ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా శాసనమండలిలో తెదేపా సభ్యులు వ్యవహరించారని చెప్పారు. వైకాపా ప్రలోభాలకు తాము లోంగబోమని స్పష్టం చేశారు. 'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని' ఉండాలన్నది తమ పార్టీ సిద్ధాంతమని పేర్కొన్నారు. గత 37 రోజులుగా రాజధాని కోసం రైతులు నిరసనలు చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోకపోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. జీఎన్‌రావు, బోస్టన్ కమిటీలు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించారు.
ఇదీ చదవండి :
'బొత్సని సీఎం జగన్ వెనకేసుకొస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు'