రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని... రాచరిక వ్యవస్థ నడుస్తోందని ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలపై ప్రశ్నించే హక్కు... ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఉంటుందని శ్రీనివాసులు గుర్తుచేశారు. తిరుపతి నగరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇసుక ఉచితంగా అందజేసిన విషయం గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం నూతన ఇసుక విధానం తీసుకొచ్చి ధర నిర్ణయించిందని ఎద్దేవా చేశారు. అయినా 50 శాతం కూడా ప్రజలకు అందడంలేదని విమర్శించారు. దీనిపై 36 గంటలు నిరాహారదీక్ష చేస్తామని ప్రకటించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర నేతలను గృహ నిర్బంధం చేయడం సమంజసం కాదని హితవు పలికారు.
ఇదీ చదవండి