ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైకాపా రూ.4 వేల కోట్లు అవినీతి పాల్పడిందని తిరుపతి పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడిన ఆయన.. ఈ విషయంపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీని తెదేపా అడ్డుకుంటుందని ఆరోపించిన సీఎం జగన్... క్రిస్మస్ రోజున ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తానని ఎలా చెప్పారన్నారు. ఏ కోర్టు జగన్‌కు అనుమతి ఇచ్చిందో తెలపాలన్నారు. సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇళ్ల స్థలాల పంపిణీపై వైకాపా నాయకులే కోర్టుకు వెళ్లి తెదేపాపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఎన్నికల ముందు పేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తానన్న జగన్.. ఇప్పటివరకు ఒక్క ఇంటిని కూడా నిర్మించలేకపోయారని నరసింహ యాదవ్ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి : వైరల్: గ్రేటర్ పోరులో 'రావాలి జగన్- కావాలి జగన్'