తిరుపతి స్విమ్స్‌లో ఎస్వీ జూపార్కు పొరుగు సేవల ఉద్యోగి మృతి చెందింది. స్విమ్స్‌లో చికిత్స పొందుతూ.. గుండె సంబంధిత సమస్యతో విజయమ్మ మరణించింది. రెండ్రోజుల క్రితం జూ పార్కులో విజయమ్మ పాముకాటుకు గురైంది. రెండు రోజులుగా స్విమ్స్ ఆస్పత్రిలో పాముకాటుకు చికిత్స తీసుకుంటుండగా గుండె సంబంధిత సమస్యతో మరణించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కావటంతో.. కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇస్తామని క్యూరేటర్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: అగ్రవర్ణ పేదలకు గుడ్ న్యూస్... 'ఈబీసీ నేస్తం'కు కేబినెట్ ఆమోదం