తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడి తెప్పోత్సవాలు 5 రోజులపాటు వైభవంగా జరిగాయి. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తి సంకీర్తనల మధ్య... వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. ఉత్సవాల్లో ఆఖరి రోజున స్వామివారు... శ్రీదేవి, భూదేవి సమేతంగా కోనేటిలో ఏడుసార్లు విహరించారు. ఉత్సవమూర్తులను దర్శించుకున్న వేలాది మంది భక్తులు.... స్వామి, అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించారు.
ఇదీ చదవండి : శ్రీవారి భక్తులకు తితిదే శుభవార్త... ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు అనుమతి