Suicide Attempt: చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళా ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుప్పం మండలం నడుమూరు గ్రామ సచివాలయంలో రెవెన్యూ సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న లావణ్య నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
వెంటనే ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే లావణ్య ఆత్మహత్యకు యత్నించిందని సహోద్యోగులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి : విజయనగరంలో భారీ చోరీ.. 5 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు