ETV Bharat / city

తితిదే నిధులతో బాండ్ల కొనుగోలుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం - తితిదే నిధులతో బాండ్ల కొనుగోలు

తితిదే నిధులతో బాండ్ల కొనుగోలుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తితిదే నిధులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్ల కొనుగోలును వ్యతిరేకిస్తూ పిల్‌ దాఖలు చేసినట్లు భాజపా నేత భాను ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.

హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
author img

By

Published : Oct 17, 2020, 4:02 PM IST

Updated : Oct 17, 2020, 4:25 PM IST

తితిదే నిధులతో బాండ్ల కొనుగోలుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భాజపా నేత, తితిదే మాజీ సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తితిదే నిధులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్ల కొనుగోలును వ్యతిరేకిస్తూ పిల్‌ వేశామని భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. అధిక వడ్డీ పేరుతో బాండ్ల కొనుగోలు నిర్ణయం సరికాదన్నారు. తితిదే నిధులు పక్కదారి పడుతున్నాయని... బాండ్ల కొనుగోలు నిర్ణయాన్ని నిలిపివేయాలని పిల్​లో పేర్కొన్నారు.

తితిదే నిధులు దారి మళ్లించేందుకు ప్రయత్నాలు

తితిదే ఫైనాన్స్ కమిటీ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో నిధులు పెడుతున్నట్లు ఆగష్టు నెలలో ధర్మకర్తల మండలి తీర్మానం చేసిందని తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన తితిదే నిధులు దాదాపు ఐదు వేల కోట్లు డిసెంబర్‌ నెలలో కాలపరిమితి తీరనున్నాయని...వాటని దారిని మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భానుప్రకాశ్ ఆరోపించారు. తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌, కార్యనిర్వాహణాధికారిని ప్రతివాదులుగా చేర్చాలని వ్యాజ్యంలో కోరారు.

ఇదీచదవండి

తెలుగు రాష్ట్రాల్లో వరద మిగిల్చిన నష్టాలు తీరేదెలా?

Last Updated : Oct 17, 2020, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.