ETV Bharat / city

శ్రీవారి దర్శనానికి నేతల ఒత్తిళ్లు.. తితిదే అధికారులకు తప్పని పాట్లు

ప్రముఖుల పేరుతో తిరుమలలో కొందరు నేతల హడావుడి ఇబ్బందిగా మారుతోంది. అధికారంలో ఉన్న కొందరు తమ అనుచరగణంతో పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకొని ప్రొటోకాల్‌ దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రొటోకాల్‌ దర్శనాలకు ఒత్తిళ్ల వల్ల శీఘ్రదర్శనం చేసుకునేవారికి ఆలస్యమవుతోంది.

ttd
ttd
author img

By

Published : Aug 21, 2021, 11:53 AM IST

అధికారంలో ఉన్న కొందరు తమ అనుచరగణంతో పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకొని ప్రొటోకాల్‌ దర్శనాలు చేసుకుంటున్నారు. వెంట ఉన్న అందరికీ ఈ అవకాశం కల్పించలేమని చెప్పలేక తితిదే అధికార యంత్రాంగం ఇబ్బంది పడుతోంది. కొవిడ్‌ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య రోజుకు 20వేల వరకు ఉంటోంది. ఇందులో ఆర్టీసీ, పర్యాటక శాఖ తరఫున సుమారు వెయ్యి టికెట్లను కేటాయించారు. శీఘ్రదర్శనం, కల్యాణోత్సవం ద్వారా మరికొందరు దర్శించుకుంటున్నారు.

ప్రముఖుల పేరుతో తిరుమలలో కొందరు నేతల హడావుడి మాత్రం ఇబ్బందికరంగా మారుతోంది. శుక్రవారం రాష్ట్ర మంత్రి ఒకరు ప్రొటోకాల్‌ దర్శనానికి ఏకంగా 67 మంది అనుచరులను వెంట తీసుకెళ్లారు. సాధారణంగా ప్రముఖుడి వెంట కేవలం నలుగురు ఐదుగురికే ప్రొటోకాల్‌ దర్శనం కల్పిస్తారు. ఎక్కువ మంది వస్తే వారిని ఇతర దర్శనాలకు పరిమితం చేస్తారు. ప్రొటోకాల్‌ దర్శనాలకు ఒత్తిళ్ల వల్ల శీఘ్రదర్శనం చేసుకునేవారికి ఆలస్యమవుతోంది. మరోవైపు సర్వదర్శన టోకెన్ల జారీ కోసం సామాన్యులు నిరీక్షిస్తూనే ఉన్నారు. వీఐపీ దర్శన టికెట్లను తగ్గించి ఆ మేరకు సామాన్యులకు అవకాశమివ్వాలనే విన్నపాలు పెరుగుతున్నాయి.

ఇదీ చదవండి: AP RAINS: రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. రహదారులు జలమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.