లాక్‌డౌన్ సడలింపుల తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. నిన్న ఆన్‌లైన్‌లో 18వేల టికెట్లు జారీ చేయగా నాలుగు గంటల్లోనే అయిపోయాయి. ఈనెల 27న శ్రీవారి దర్శనం కోసం ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్లకు తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్నారు. వీటి కోసం భక్తులు బారులు తీరారు.
రోజుకు 6750 మంది భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించాలని తితిదే నిర్ణయించింది. ఈమేరకు ఉచిత దర్శన టోకెన్ల జారీని తితిదే శుక్రవారం ఉదయం ప్రారంభించింది. స్వామివారిని దర్శించుకోవడానికి సర్వదర్శనం ఉచిత టోకెన్ల జారీ తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ప్రారంభమైంది. తిరుపతిలోని విష్ణునివాసంలో 8 కౌంటర్లు, శ్రీనివాసంలో 6 కౌంటర్లు, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 18 కౌంటర్లలో 3 వేల ఉచిత దర్శన టోకెన్లను జారీ చేస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల నుంచే భక్తులు టోకెన్ల కోసం బారులు తీరారు.
ఇదీ చదవండి :