తిరుమల శ్రీవారికి ఈ నెల 15న పార్వేట ఉత్సవంను తితిదే నిర్వహించనుంది. ప్రతి ఏడాది మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున స్వామివారిని అటవీ ప్రాంతంలోని పార్వేట మండపం వద్దకు వేంచేపు చేస్తారు. అక్కడ అర్చకులు పార్వేట ఉత్సవంలో భాగంగా ఆస్థానంను అత్యంత ఘనంగా జరుపుతారు. అనంతరం స్వామివారు వేటాడే సన్నివేశాలను అర్చకులు నిర్వహిస్తారు. ఆ రోజున శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది.
ఇదీ చదవండి: తితిదేకు రూ. 10 లక్షల 166 లను విరాళమిచ్చిన ఒంగోలుకు చెందిన భక్తుడు