తిరుమల శ్రీవారి ఆలయంలో విజయదశమి పార్వేట ఉత్సవాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. పార్వేటోత్సవంలో భాగంగా కల్యాణోత్సవ మండపంలో మలయప్పస్వామివారిని సన్నిధి నుంచి వేంచేపు చేశారు. అక్కడ పంచాయుధాలైన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనస్సు ధరింపచేశారు. కొవిడ్-19 నిబంధనల కారణంగా ఆలయంలోని తితిదే అటవీ విభాగం ఏడుకొండలతో పాటు శేషాచలాన్ని తలపించేలా నమూనాను రూపొందించింది.
నమూనా అడవిలో వివిధ రకాల చెట్లు, రాళ్లు ఏర్పాటు చేశారు. అందులో వన్యమృగాల బొమ్మలను ఉంచారు. ఈ ప్రాంతంలో స్వామివారు వేటలో పాల్గొన్నారు. అనంతరం విమాన ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు.
ఇదీ చదవండి : ఘనంగా దుర్గమ్మకు తెప్పోత్సవం