అర్చకులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయంలో పదవీ విరమణ చేసిన అర్చకులు.. మళ్లీ విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు తితిదే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన అర్చకులతో పాటు అర్చకులు విధుల్లో చేరాలని సూచించింది.
ఆ నాడు ఏం జరిగిందంటే..
2018లో అప్పటి పాలకమండలి తీసుకున్న నిర్ణయం మేరకు పదవీ విరమణ చేసిన ప్రధాన అర్చకులను.. తిరిగి విధుల్లో చేరాల్సిందిగా ఉత్తర్వులు వెలువరించింది. 2018 మే 16న అప్పటి పాలకమండలి అర్చకులు, ప్రధాన అర్చకులకు పదవీ విరమణ వయస్సు నిర్ణయించి.. వయస్సు పైబడిన వారందరిని పదవీ విరమణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస దీక్షితులు, నారాయణమూర్తి దీక్షితులతో పాటు మరో 11 మంది అర్చకులు పదవీ విరమణ చేశారు.
కోర్టుకు వెళ్లిన అర్చకులు
పాలక మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ అర్చకులు.. కోర్టును ఆశ్రయించారు. విధి నిర్వహణ చేయగల స్ధాయిలో శారీరక సామర్ధ్యం కలిగిన వారిని విధుల్లోకి తీసుకోవాలని.. డిసెంబర్ 2018న కోర్టు తీర్పు వెలువరించింది. అప్పటి కోర్టు తీర్పును ఆధారం చేసుకొని తితిదే తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది.
విధుల్లో 15మంది అర్చకులు
తితిదే తాజా నిర్ణయంతో రమణ దీక్షితులతో పాటు మరో 14 మంది అర్చకులు.. తిరిగి విధుల్లో చేరనున్నారు.
ఇదీ చదవండి: