Moose Fell in Well: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టిఎస్ అగ్రహారం. అగ్రహారానికి చేరువలోని చిట్టడవి నుంచి ఓ దుప్పి బయటకు వచ్చింది. పాపం... తిరిగి అడవిలోకి వెళ్లే దారి మరిచిపోయిందేమో... అటు ఇటూ తిరుగుతూ...పొరపాటున పాడుబడిన బావిలో పడిపోయింది. ఉదయం అటుగా వెళ్తున్న వారు బావిలో దుప్పిని గమనించారు. వెంటనే అటవీ, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఆ నోటా..ఈనోటా అగ్రహారంలో కూడా అందరికీ విషయం తెలిసింది.
ఓ వైపు బావి వద్ద అంతా గూమిగూడారు. మరోవైపు దుప్పిని బయటకు తీసేందుకు సిబ్బంది ప్రయత్నాలు. ఏం జరుగుతుందో తెలియని ఆ అమాయక ప్రాణి... బిక్కుబిక్కుమంటూ అటూ ఇటూ తిరుగుతూ..సుమారు రెండు గంటల పాటు బావిలోనే తచ్చాడింది. బయటకు తీసే ప్రయత్నంలో.. పట్టు దొరికింది. అంతే ఒక్క ఉదుటున చెంగున పరుగు లంకించుకుంది. అక్కడినుంచి చిటికెలో మాయం అయ్యింది. ఏదైతేనేం..దుప్పి క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి :