తిరుమల శ్రీవారిని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే జోగి రమేష్, వైకాపా నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
రామతీర్థం ఘటన బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘటన ముఖ్యమంత్రి జగన్‌దేనని వైకాపా నేత ఉమారెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అన్నీ ఇస్తున్నా... ప్రతిపక్షం కావాలనే నిందిస్తుందని మండిపడ్డారు.
ఇదీ చదవండి: