చిత్తూరు జిల్లా రేణిగుంటలో స్పైస్‌జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతుండగా స్పైస్‌జెట్ విమాన చక్రం టైర్ పంక్చర్ అయింది. ముంబయి నుంచి హైదరాబాద్ మీదుగా రేణిగుంట చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. మరమ్మతులు చేసేందుకు చెన్నై నుంచి సిబ్బందిని రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో అన్ని బార్ల లైసెన్సులు రద్దు... ఉత్తర్వులు జారీ