ఇదీ చదవండి:
'అవినీతి వెలికితీస్తే చంద్రబాబుకు 16 ఏళ్లు జైలు' - చంద్రబాబుపై పెద్దిరెడ్డి కామెంట్స్
చిత్తూరు జిల్లా మొగిలి కనుమ రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇసుక కొరతకు కారణాలు తెలిసి కూడా కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. జగన్ 16 నెలలు మాత్రమే జైలులో ఉంటే... చంద్రబాబు అవినీతి బయటకు తీస్తే 16 ఏళ్లు కారాగారమేనని విమర్శించారు.
అవినీతి వెలికితీస్తే చంద్రబాబుకు 16 ఏళ్లు జైలు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తెదేపా అధినేత చంద్రబాబును అవినీతి కూపం నుంచి ఆ భగవంతుడే కాపాడాలంటూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తిరుపతిలోని స్వగృహంలో మాట్లాడిన ఆయన.. చిత్తూరు జిల్లా మొగిలి కనుమ రహదారి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రభుత్వం తరఫున మృతులు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం వారి బంధువులకు అందిస్తామన్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవటంతో ఇసుక తీయటానికి సాధ్యం కాని విషయం తెలిసి కూడా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెదేపాకు వత్తాసు పలుకుతున్నారన్నారు. వైఎస్ జగన్ను 16 నెలలు జైల్లో ఉన్న అవినీతిపరుడిగా తెదేపా అధినేత ప్రచారం చేస్తున్నారన్న ఆయన... చంద్రబాబు చేసిన పనులన్నీ బయటకు తీస్తే 16 ఏళ్లు జైలులో ఉండాల్సి వస్తుందంటూ మండిపడ్డారు.
ఇదీ చదవండి:
Last Updated : Nov 9, 2019, 10:06 PM IST