ETV Bharat / city

20 శాతం మద్యం దుకాణాలు తగ్గించాం: నారాయణస్వామి - 20 శాతం మద్యం దుకాణాలు తగ్గించాం

మద్య నిషేధం దశలవారీ అమలుకు తొలి అడుగు పడిందని అబ్కారీ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. గతంలో ఉన్న 43 వేల మద్యం గొలుసు దుకాణాలు రద్దు చేశామన్న ఆయన... 20 శాతం తగ్గించి 3500 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశామన్నారు.

రాష్ట్రంలో 20 శాతం మద్యం దుకాణాలు తగ్గించాం : నారాయణస్వామి
author img

By

Published : Oct 1, 2019, 5:18 PM IST

రాష్ట్రంలో 20 శాతం మద్యం దుకాణాలు తగ్గించాం : నారాయణస్వామి

దశలవారీ మద్య నిషేధంపై ప్రభుత్వం తొలి అడుగు వేసిందని అబ్కారీ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన... నూతన ఎక్సైజ్ విధానం వివరాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3500 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఉన్న 43 వేల మద్యం గొలుసు దుకాణాలు రద్దు చేశామని స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 వరకు విక్రయాలు ఉంటాయని నారాయణస్వామి అన్నారు. గ్రామ కమిటీల ద్వారా నాటుసారా విక్రయాలు పూర్తిగా నిర్మూలించామన్నారు. నాటుసారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనకు చర్యలు చేపడతామన్నారు. అన్ని ఆస్పత్రుల్లోనూ డీ అడిక్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బార్ల సంఖ్య తగ్గింపులో న్యాయపరమైన సమస్యలున్నాయని నారాయణస్వామి అన్నారు. ప్రతి విషయంపై సమగ్ర అవగాహనతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. లోపభూయిష్టంగా ఎలాంటి కార్యక్రమాలు చేయట్లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :

ఈ ఏడాదికి కొత్త ఎక్సైజ్ విధానం వచ్చేసింది!

Intro:ap_rjy_37_01_gandhi darshan_avb_ap10019. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్

Body:యానం లో మాత్మ గాంధీ డిజిటల్ ఫోటోలు మరియు పుస్తకాల ప్రదర్శన

Conclusion:కేంద్రపాలిత యానాంలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ డిగ్రీ కాలేజీలో మహాత్మా గాంధీ నీ నోట 50 వ జయంతి సందర్భంగా గాంధీ దర్శనం పేరుతో ఆయనకు సంబంధించిన డిజిటల్ ఫోటోలు ప్రచురితమైన పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేశారు తణుకు కి చెందిన ప్రముఖ గాంధేయవాది వాడ్రేవు సుందర్రావు 1876 నుండి 1931 వరకు గాంధీజీ జీవితంలో జరిగిన అనేక సంఘటనలకు సంబంధించి సేకరించని చిత్రాలను డిజిటలైజేషన్ చేసారు. ఇందులో ప్రధానంగా గాంధీజీ బాల్యం నుండి దక్షిణాఫ్రికా ప్రయాణం దండయాత్ర రౌండ్ టేబుల్ సమావేశం 1948లో గాంధీజీ అస్తమయం వరకు ఉన్నాయి వీటితోపాటు వివిధ రచయితలు ఆయనపై రాసిన పుస్తకాలతో పాటు ఆత్మకథ కూడా ప్రదర్శన కొరకు ఉంచారు యానం లోని పది ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించారు.. గాంధీజీ అంటే ఒక స్వతంత్ర సమరయోధులు గా మాత్రమే తెలుసని ఆయన పడ్డ అవమానాలు దేశం కోసం పడ్డ కష్టాలు ఈ చిత్రాల ద్వారా తెలుసుకున్నానని విద్యార్థులు తెలిపారు... పోర్ బందర్ లో జన్మించిన ఒక సాధారణ బాలుడు తన జీవితంలో లో ఎవరైనా పరాజయాలకు కుంగిపోకుండా ధైర్యంగా సాగించిన పోరాటం సాధించిన విజయాలు నేటి యువతరానికి తెలపాలని ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది..
బైట్లు:కాలేజ్ విద్యార్ధిని
ప్రధాన కర్త :వాడ్రేవు సుందర రావు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.