ETV Bharat / city

నేడు శ్రీవారిని దర్శించుకోనున్న లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా

నేడు తిరుమల శ్రీవారిని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా దర్శించుకోనున్నారు. ఉదయం విరామ సమయంలో శ్రీవారి దర్శించుకోనున్నారు. సోమవారం ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చేరుకున్న లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా.. ముందుగా తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు.

స్పీకర్​ ఓం బిర్లా
స్పీకర్​ ఓం బిర్లా
author img

By

Published : Aug 16, 2021, 7:15 PM IST

Updated : Aug 17, 2021, 6:37 AM IST

నేడు తిరుమల శ్రీవారిని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా దర్శించుకోనున్నారు. ఉదయం విరామ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. సోమవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న లోక్‌సభ స్పీకర్ ఓం​ బిర్లా.. సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. తితిదే ఈవో, అదనపు ఈవో స్పీకర్‌కు స్వాగతం పలికారు.

శ్రీవారి దర్శనాంతరం పద్మావతి వసతిగృహంలో తితిదే అధికారులతో సమీక్షించనున్న ఓంబిర్లా.. తిరుమల ధర్మగిరి వేదపాఠశాలను సందర్శించనున్నారు. తదుపరి తిరుపతి కపిలేశ్వర స్వామిని దర్శించుకుని.. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని దర్శనం చేసుకోనున్నారు.

పద్మావతి అమ్మవారి సేవలో..

దేశం క్షేమంగా ఉండాలని.. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ పద్మావతి అమ్మవారిని కోరుకున్నట్లు లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వచ్చిన ఆయన.. తొలుత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆ తరువాత శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన ఆయన రోడ్డు మార్గంలో తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయం వద్ద తితిదే ఛైర్మన్​ వై.వీ.సుబ్బారెడ్డి, ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేకపూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 909 కరోనా కేసులు నమోదు

Last Updated : Aug 17, 2021, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.