ETV Bharat / city

వైభవంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం - తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యం వార్తలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో కోయిల్‌ ళ్వార్‌ తిరుమంజనం వైభవంగా జ‌రిగింది. ఉదయం 6.30 నుంచి 9 గంటల వరకు కార్యక్రమం చేపట్టారు.

Koil Alwar Thirumanjanam was held at Sri Padmavathi Temple
వైభవంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
author img

By

Published : Feb 16, 2021, 4:01 PM IST

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జ‌రిగింది. ఈ నెల 19న ర‌థ‌స‌ప్త‌మి నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి... 6.30 నుంచి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు.

నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా సంప్రోక్షణం చేశారు. అనంత‌రం భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పించారు.

ఇదీ చదవండి:

135 రోజుల్లో 6వేల కిలోమీటర్లు.. దేశాన్ని చుట్టిరావడమే లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.