తితిదే పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా.. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఎక్స్ అఫీషియో సభ్యులుగా తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. స్వామివారి సన్నిధిలోని బంగారు వాకిలి వద్ద చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డితో అదనపు ఈవో ధర్మారెడ్డి వేర్వేరుగా ప్రమాణం చేయించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తితిదే పాలకమండలిలో రెండోసారి అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అన్నారు. గత పాలకమండలిలో వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో శ్రీవారి ఆలయ ప్రతిష్ఠను విశ్వవ్యాప్తి చేసేందుకు కృషి చేశామన్న కరుణాకర్ రెడ్డి.. శ్రీవారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.
వెంకటేశ్వరస్వామి సన్నిధిలో స్వామికి సేవ చేసుకునే మహదావకాశాన్ని ఆ వెంకటేశ్వరస్వామి కృపతో ముఖ్యమంత్రి జగన్ ఆశీర్వాదంతో స్థానం సంపాదించుకుని, పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమింపబడటం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. గత బోర్డులో పాలకమండలి అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి నేతత్వంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంత పటిష్టవంతంగా జరిగాయో... ఈ బోర్డు ద్వారా మరింత పెద్ద ఎత్తున హైందవ సంస్కృతీ సాంప్రదాయాలు, ఆచారాలు కాపాడుకుంటూ మన ఆలయ ప్రతిష్ఠతను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తాను.
కరుణాకర్ రెడ్డి, తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు
ఇదీచదవండి.