చిత్తూరు జిల్లా కంభంవారిపల్లి మండలంలో సుమారు రూ.60 లక్షల విలువచేసే 41 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన 23 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. కంభంవారిపల్లి మండలంలోని నూతన కాలవ అటవీ ప్రాంతంలో వాల్మీకిపురం, పీలేరు పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. టమాటా ట్రేల లోడుతో వెళ్తున్న ఐషర్ వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో పోలీసులు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి.
వాహనంలో ఉన్న తమిళనాడుకు చెందిన 23 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో పది మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి గాలింపు చేపడతామని పోలీసులు తెలిపారు. వాల్మీకిపురం, పీలేరు సీఐలు నాగార్జున రెడ్డి, సాదిక్ ఆలీ, విక్రమ్‌లు తమ సిబ్బందితో తనిఖీ వివరాలను వెల్లడించారు.
ఇదీ చదవండి: