ప్రభుత్వం ఏ ఒక్క కులం కోసమో, మతం కోసమో పనిచేయటం లేదని హోంమంత్రి సుచరిత అన్నారు. తిరుపతిలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు వేడుకలకు హాజరైన ఆమె.. అనంతరం దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంపై మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు చేరనీయకుండా అడ్డుకునేందుకు విగ్రహాల ధ్వంసం తెరమీదకు తీసుకువచ్చారని అన్నారు. ఘటనలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏ ఒక్కమతాన్ని, కులాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం పనిచేయదన్న సుచరిత.. ప్రార్థనామందిరాలపై దాడుల జరిగిన ప్రతి చోట కొత్త దేవాలయాలు నిర్మిస్తామని సీఎం జగన్ ఇప్పటికే స్పష్టం చేశారని అన్నారు.
ఇదీ చదవండి: కిడ్నాప్ కేసు : భూమి ధర పెరిగింది.. గుడ్విల్ కోసమే బెదిరింపులు!