ఎన్నికల వేళ అధికారులు వైకాపా కార్యకర్తల్లా పని చేస్తున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి 15వ డివిజన్లో తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి జ్యోత్స్నతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే.. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపాకు ఓటెయ్యాలని కోరారు.
నామినేషన్ల దాఖలు, పరిశీలన దశల్లో అధికారులందరూ వైకాపాకు మద్దతుగా నిలిచారని అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. తమ అభ్యర్థులను చెన్నై, బెంగళూరు తీసుకువెళ్లి దాచుకోవాల్సిన భయానక వాతావరణం చిత్తూరు జిల్లాలో ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: