ETV Bharat / city

ఉపపోరులో సాంకేతిక సమస్యలు.. పలుచోట్ల నిలిచిన ఎన్నికలు

చిత్తూరు జిల్లా ఉపపోరులో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఈ కారణంగా.. చాలా సేపు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. నెల్లూరు జిల్లా గూడూరులో ఈవీఎంకు బ్యాటరీ లేని కారణంగా.. అక్కడ పోలింగ్ ప్రారంభం కాలేదు.

evm problems
సహకరించని ఈవీఎంలు
author img

By

Published : Apr 17, 2021, 10:23 AM IST

చిత్తూరు జిల్లా ఉపపోరులో.. పలుచోట్ల ఈవీఎంల మొరాయింపుతో సమస్యలు నెలకొన్నాయి. జిల్లాలోని బీఎన్‌ కండ్రిగ మండలంలోని కుక్కంభాకం, పార్లపల్లి, కొత్తపాలెం గ్రామాల్లో సాంకేతిక సమస్యలతో చాలాసేపటివరకు పోలింగ్ ప్రారంభం కాలేదు.

గూడూరులో...

ఉపఎన్నికల్లో భాగంగా.. నెల్లూరు జిల్లా గూడూరులోని 47, 48, 48 కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వాకాడులోని 285వ పోలింగ్ కేంద్రం, రావిగుంటపాలెంలోని రెండు కేంద్రాల్లో ఈవీఎంలకు బ్యాటరీ లేని కారణంగా.. ప్రక్రియ నిలిచిపోయింది. సైదాపురం మండలంలోని 3 గ్రామాలోను ఈవీఎంల సమస్య ఏర్పడింది. రామసాగరం, గులించెర్ల, కేజీఆర్​పాలెంలో పోలింగ్ నత్తనడకన సాగుతోంది.

ఇదీ చదవండి:

వెంకటగిరిలో పోలింగ్ కేంద్రాలకు తరులుతున్న ఓటర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.