కోడ్ ఉల్లంఘిస్తూ బంగ్లాదేశ్ నుంచి మోదీ ఎన్నికల ప్రచారం చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం జగన్ మోహరించారని నారాయణ విమర్శించారు. తాము కరపత్రాలు పంచాలని చూస్తే.. వారు కరెన్సీ పంచుతున్నారని ధ్వజమెత్తారు. ఉక్కు ఉద్యమాన్ని అణచివేయడానికి వైకాపా కుట్రలు చేసిందని ఆరోపించారు.
ఇదీ చదవండీ... బడ్జెట్ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం