ETV Bharat / city

ఘనంగా శ్రీవారికి ఛత్రస్థాపనోత్సవం - తిరుమల సమాచారం

తిరుమల శ్రీవారికి ఛత్రస్థాపనోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆల‌య మాడ వీధుల గుండా నారాయ‌ణ‌గిరికి శ్రీ వెంకటేశ్వర స్వామి చేరుకున్నారు.

chhatrasthapanotsavam
ఛత్రస్థాపనోత్సవం
author img

By

Published : Jul 21, 2021, 5:19 PM IST

తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం వైభవంగా జరిగింది. శ్రీవారి ఆలయంలో రెండో గంట తర్వాత పూజ సామ‌గ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆల‌య మాడ వీధుల గుండా నారాయ‌ణ‌గిరికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు శ్రీ‌వారి పాదాల‌కు తిరుమంజ‌నం నిర్వహించి... అలంకరణ, ప్రత్యేక పూజలు చేసి.. నైవేద్యం సమర్పించారు. వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు.

పురాణాల ప్రకారం సప్తగిరుల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపాడు. ఇక్కడ ప్రతి ఏటా ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారని పండితులు తెలిపారు.

ఇదీ చదవండి: ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి దర్శనం.. ఆన్​లైన్​లో టికెట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.