ఎస్వీ ఆయుర్వేదిక్ ఆసుపత్రి వైద్యులతో తితిదే పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సమావేశమయ్యారు. ఆనందయ్య మందుకు అనుమతి వస్తే ఆయుర్వేద ఫార్మసీలో ఔషధం తయారీకి రచించాల్సిన ప్రణాళికపై చర్చించారు.
వైద్యుల బృందంతో కలిసి ఆయుర్వేద ఔషధాన్ని పరిశీలించామన్న చెవిరెడ్డి..మందులో దుష్ప్రభావ పదార్థాలు లేవని వైద్యులు చెప్పారన్నారు. ఐసీఎంఆర్, ఆయుష్ నివేదికల కోసం వేచి చూస్తున్నామన్నారు. అనుమతి వస్తే ఆయుర్వేద ఫార్మసీలో ఔషధం తయారీకి తితిదే సిద్ధంగా ఉందన్నారు. శేషాచల అడవుల్లో వనమూలికలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆనందయ్యది కరోనా మందు కాదని తేల్చినా..ఇమ్యూనిటీ బూస్టర్లుగా పరిశీలిస్తామని చెవిరెడ్డి స్పష్టం చేశారు.
ఇదీచదవండి