తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
కరోనా తగ్గుముఖం పడుతోందని.. ప్రజలందరూ కరోనా టీకా వేయించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలను, ఆలయాల నిర్మాణం, ధూపదీప నైవేద్యాలకు తితిదే సహకారం అందించాలన్నారు. శేషాచలంలోని ఎర్రచందనం కాపాడేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
ఇదీ చదవండి: