ETV Bharat / city

కాగ్​ పరిధిలోకి తితిదే... రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు! - తితిదే నిధుల వినియోగంపై కాగ్ ఆడిట్ న్యూస్

తితిదే నిధులు హిందూ ధార్మికేతర కార్యకలాపాలకు వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకొంది. తితిదే ఆదాయ, వ్యయాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌... కాగ్‌ ద్వారా ఆడిట్‌ చేయించాలని తీర్మానం చేసింది. ధర్మకర్తల మండలి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఇకపై తితిదే ఆదాయ, వ్యయాలపై కాగ్‌ ఆడిట్‌ చేయనుంది.

తితిదే నిధుల వినియోగంపై 'కాగ్' ఆడిట్
తితిదే నిధుల వినియోగంపై 'కాగ్' ఆడిట్
author img

By

Published : Sep 3, 2020, 6:52 PM IST

Updated : Sep 4, 2020, 2:31 AM IST

కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీనివాసునికి సమకూరే ఆదాయ, వ్యయాలను కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్‌ ద్వారా ఆడిట్‌ చేయించాలని తితిదే ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకొంది. తిరుమల శ్రీవారికి సామాన్య భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల ద్వారా సమకూరే ఆదాయాన్ని హిందూ ధార్మికేతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని....నిధులు పక్కదారి పడుతున్నాయంటూ వివిధ ప్రజా సంఘాల ఆరోపణల నేపథ్యంలో తితిదే కీలక నిర్ణయం తీసుకొంది. ఆగష్టు 28న తిరుమల అన్నమయ్య భవనం వేదికగా జరిగిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో తితిదే నిధుల వినియోగంపై సుదీర్ఘంగా చర్చించారు. శ్రీవారికి కానుకల ద్వారా సమకూరే ఆదాయం, వినియోగంపై విమర్శలకు తావు లేకుండా చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్‌ ద్వారా తితిదే నిధులపై ఆడిటింగ్‌ చేయించాలని సమావేశంలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు.

తిరుమల శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించే కానుకలతో పాటు వివిధ మార్గాల ద్వారా ఏడాదికి మూడు వేల కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరుతుంది. దీని ద్వారా తితిదే పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. నిధులు వినియోగంపై అంతర్గతంగా తితిదే ఏటా ఆడిట్‌ నిర్వహిస్తుండగా....రాష్ట్ర ఆడిట్ శాఖ ఎక్స్‌టర్నల్‌ ఆడిటింగ్‌ చేస్తుంది. నిధుల ఆడిటింగ్‌ కోసం రాష్ట్ర ఆడిట్ శాఖ ద్వారా దాదాపు 230 మంది సిబ్బంది తితిదేలో విధులు నిర్వహిస్తుంటారు. రాష్ట్ర ఆడిట్‌ శాఖ నిర్వహించే ఆడిటింగ్‌ స్థానంలో... కేంద్ర ప్రభుత్వ సంస్థ కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్ జనరల్‌ ద్వారా ఆడిట్‌ చేయించాలని ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది.

తితిదే నిధుల వినియోగంపై కాగ్‌ ద్వారా ఆడిట్ చేయాలని 2008 సంవత్సరంలో ఓ సారి ధర్మకర్తల మండలి చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే... కేంద్రం అనుమతి కోసం లేఖ పంపాల్సి ఉంటుంది

ఇదీ చదవండి:

వచ్చే ఏప్రిల్ నుంచే విద్యుత్ నగదు బదిలీ అమలు

Last Updated : Sep 4, 2020, 2:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.