తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును 81 మందితో నియమించడం దురదృష్టకరమని భాజాపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత మందితో పాలకమండలి సమావేశం నిర్వహించాలంటే.. అన్నమయ్య భవనం నుంచి ఆస్థాన మండపానికి మార్చాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ఈ నిర్ణయం హిందుమతం మీద దాడిగా తాము భావిస్తూన్నట్లు వ్యాఖ్యానించారు. భక్తులు నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని…ఈ బోర్డును వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. బోర్డు సభ్యులు మల్లాడి కృష్ణారావు మాటలను భానుప్రకాష్ రెడ్డి తప్పు పట్టారు.
ఇదీ చదవండి: TIRUMALA: తిరుమల శ్రీవారి సేవలో రోజా, సమంత