Amravathi Sabha: అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు - tirupathi
హైకోర్టు అనుమతి ఇవ్వడంతో.. అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ పేరిట రేపు మధ్యాహ్నం తిరుపతి సమీపంలో భారీ బహిరంగ సభకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు. అమరావతి నినాదం ఎలుగెత్తి చాటేలా సభ ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు. తిరుపతి సమీపంలోని ఓ ప్రైవేటు స్థలంలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. న్యాయస్థానం ఆదేశాలకు లోబడి సభ నిర్వహిస్తామని ఐకాస నేతలు స్పష్టం చేశారు. అన్ని ప్రధాన పార్టీల రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు, అన్ని ప్రజాసంఘాలకూ ఆహ్వానం పలికామన్నారు. దాదాపు 20 ఎకరాల స్థలంలో సభా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. విభాగాల వారీగా ప్రత్యేక గ్యాలరీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, అమరుస్తున్నారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరికీ భోజన ఏర్పాట్లు చేశామంటున్న సభా నిర్వాహకులతో ముఖాముఖి.