ETV Bharat / city

డీజీపీ గౌతమ్ సవాంగ్.. యువతతో కాసేపు!

రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జరుగుతున్న స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్.. తిరుపతిలో ఉత్సాహంగా సాగుతోంది. రెండోరోజు సైబర్ నేరాలపై సింపోజియంల నిర్వహణతో పాటు జాతీయ స్థాయి విద్యాసంస్థలతో.. పోలీసు అధికారులు పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. యువతను పోలీస్ శాఖ వైపు ఆకర్షించేలా యువ ఐపీఎస్ అధికారులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపింది.

Ap State Police
Ap State Police
author img

By

Published : Jan 6, 2021, 8:47 AM IST

డీజీపీ గౌతమ్ సవాంగ్.. యువతీయువకులతో కాసేపు

పోలీసుల శక్తియుక్తులు, ప్రతిభాపాటవాలకు వేదికగా భావిస్తున్న స్టేట్ డ్యూటీ పోలీస్ మీట్ ఘనంగా జరుగుతోంది. రెండో రోజు సైబర్ నేరాల నియంత్రణపై నిర్వహించిన సదస్సుల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు అవలంబిస్తున్న నూతన పంథాలను సీనియర్ పోలీసు అధికారులు వివరించారు. సైబర్ మోసాలకు గురికాకుండా మొబైల్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను భద్రంగా ఉంచుకోవాల్సిన తీరు, యాప్‌ల వినియోగం, ఇన్‌స్టాల్‌ చేసుకొని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణులు వివరించారు. రుణయాప్ ల బారిన పడి ప్రజలు మోసపోకుండా జాగ్రత్త వహించాలని కోరారు.

సాంకేతిక పురోగతి, వ్యవస్థ బలోపేతం కోసం ఏపీ పోలీస్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థలతో ఎంఓయూలను కుదుర్చుకుంది. ఈ మేరకు ఆయా సంస్థల ప్రతినిధులు, డీజీపీ గౌతం సవాంగ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సివిల్ సర్వీసెస్.... ప్రత్యేకించి పోలీస్ శాఖ గొప్పతనాన్ని వివరించేలా.. యువ ఐపీఎస్ అధికారులు, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్ పాల్గొని యువతీయువకులతో ముచ్చటించారు.

రెండో రోజు కార్యక్రమంలో వర్షం ఏకధాటిగా కురవటంతో మైదానంలో కార్యక్రమాలు రద్దయ్యాయి. జోరువానలోనూ ప్రకాశం జిల్లా స్వాట్ దళాలు చేసిన విన్యాసాలు వీక్షకులను అబ్బురపరిచాయి.

ఇదీ చదవండి:

బ్రిటన్​పై కరోనా పంజా.. ఒక్కరోజే 60వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.