భాజపా దళితుల వ్యతిరేక పార్టీ అని సినీ నటుడు కత్తి మహేష్ విమర్శించారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండగా.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
మతాలు, కులాలను అడ్డుపెట్టుకొని.. భాజపా విద్వేషపూరిత చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తిరుపతిలో బైబిల్ వర్సెస్ భగవద్గీత అన్నట్లు.. ఆ పార్టీ నేతలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మాల, మాదిగ సామాజిక వర్గాలు ఏకమై.. వైకాపా అభ్యర్థికి విజయాన్ని కట్టబెట్టాలని కోరారు.
ఇదీ చదవండి:
పుదుచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇవ్వలేదు: సుజనా చౌదరి