చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన మున్నాను చిత్తూరు జిల్లా తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఈ నెల 8న... స్నానాల గదికి తీసుకెళ్లి మున్నా అత్యాచారం చేశాడు. మున్నా సొంతూరు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గుండెమలగల గ్రామం. 20ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం తిరుపతి వచ్చాడు. తిరుపతికి చెందిని ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులకు మొదటి భార్యను వదిలేసి మంగళం కృష్ణవేణి యాదవ్ కాలనీకి చెందిన మరో మహిళ వివాహమాడాడు. మంగళం ప్రాంతంలోని శుద్దజల కేంద్రంలో మున్నా ఉపాధి పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. నిందితునిపై అత్యాచారం, ఫోక్సో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: