- High court: దాచేపల్లి, గురజాలలో ఎన్నికలు సజావుగా జరగాలి: హైకోర్టు
గుంటూరు జిల్లా(guntur district)లోని దాచేపల్లి, గురజాలలో నగర పంచాయతీ ఎన్నికలు (dachepalli-gurajala elecation) సజావుగా జరగాలని హైకోర్టు ఆదేశించింది. దాచేపల్లి, గురజాలలో ఎన్నికలు సజావుగా జరపాలని అభ్యర్థులు వేర్వేరుగా హైకోర్టు(high court)లో పిటిషన్లు దాఖలు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- LOKESH: వారం రోజుల్లో జీవో 42ను వెనక్కు తీసుకోవాలి: లోకేశ్
ఎయిడెడ్ విద్యావ్యవస్థను కాపాడేందుకు పోరాటం చేస్తామని నారా లోకేశ్ అన్నారు. జీవో 42ను వారంలోగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం పర్యటనలో ఉన్న నారా లోకేశ్.. ఎస్ఎస్బీఎన్ కళాశాల విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో.. అదే ప్రధానమట!
ఎమ్మెల్యేల కోటాలో మూడు, స్థానిక సంస్థల విభాగంలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు అధికార వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Liquor rates: మద్యంపై పన్ను రేట్ల సవరణ.. ప్రభుత్వ ఉత్తర్వులు
మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్‌లో మార్పు చేస్తూ అబ్కారీ శాఖ జీవో జారీ చేసింది. రిటైల్ ధరలో ఎలాంటి మార్పు ఉండదని ఆబ్కారీ శాఖ స్పష్టం చేసింది. మద్యం మూలధరపై తొలి విక్రయం జరిగే చోట పన్ను సవరణ చేసినట్లు తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఎంపీ ల్యాడ్స్ నిధుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం
ఎంపీ ల్యాడ్స్ నిధుల పథకాన్ని పునరుద్ధరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 వరకు దీన్ని కొనసాగించాలని నిర్ణయించింది. 2021-22 మిగిలన ఆర్థిక సంవత్సరానికి గానూ ఒక్కో ఎంపీకి రూ.2కోట్ల నిధులు మంజూరు చేయనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- యమునా నదిలో విషపు నురగల తొలగింపునకు వెదురు తడకలు
యమునా నదిలో విషపు నురగల తొలగింపునకు దిల్లీ ప్రభుత్వం (chhath puja yamuna ghat in delhi) చర్యలు ప్రారంభించింది. ఘాట్ వద్ద వెదురు తడకలను ఏర్పాటు చేస్తోంది. నురగలు విచ్ఛిన్నం చేసేందుకు నీటి తుంపరలను ఉపయోగిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మరోసారి జపాన్ ప్రధానిగా ఎన్నికైన కిషిడా
బుధవారం జరిగిన ఓటింగ్‌లో పార్లమెంట్ సభ్యులు ఆమోదం తెలపడం వల్ల కిషిడా (kishida fumio) జపాన్ ప్రధానిగా మరోసారి ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కిషిడా ప్రాతినిథ్యం వహిస్తున్న లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ.. 465 మంది సభ్యులు గల పార్లమెంట్ దిగువ సభలో 261 సీట్లు సాధించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Stocks Markets: స్టాక్ మార్కెట్లకు స్వల్ప నష్టాలు
స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్‌ను స్వల్ప నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్ 80 పాయింట్లు కోల్పోగా.. మరో సూచీ నిఫ్టీ 27 పాయింట్లు దిగజారింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ICC T20 Rankings: కేఎల్ రాహుల్ పైపైకి.. కోహ్లీ దిగువకు
ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను(ICC ranking T20) విడుదల చేసింది. టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(kl rahul news) ఐదో స్థానానికి చేరుకోగా కెప్టెన్ విరాట్ కోహ్లీ 8 స్థానానికి పడిపోయాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Adipurush movie:'ఆదిపురుష్' షూటింగ్ పూర్తి.. మరో పదినెలలు మాత్రం
ప్రభాస్ రాముడిగా నటిస్తున్న 'ఆదిపురుష్' షూటింగ్ మొత్తం పూర్తయింది. వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.