ETV Bharat / city

YSRCP MP COMMENTS ON RRR: రఘురామపై అనర్హత వేటు తప్పదు: ఎంపీ భరత్‌రామ్‌ - రాజమహేంద్రవరం తాజా వార్తలు

YSRCP MP COMMENTS ON RRR: నరసాపురం ఎంపీ రఘురామ హాస్యనటుడంటూ వైకాపా ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. రఘురామను కచ్చితంగా సస్పెండ్ చేస్తారని తెలిసే రాజీనామాను తెరపైకి తెచ్చారని అన్నారు.

YSRCP MP COMMENTS ON RRR
YSRCP MP COMMENTS ON RRR
author img

By

Published : Jan 12, 2022, 10:08 AM IST

YSRCP MP COMMENTS ON RRR: వైకాపాకు చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు తప్పదని వైకాపా పార్లమెంటరీ చీఫ్‌ విప్‌, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. సినిమాల్లో హాస్యనటుడి మాదిరిగా రఘురామకృష్ణరాజు రాజకీయాల్లో కమెడియన్‌ అంటూ రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: MP RAGHURAMA RAJU: హైదరాబాద్‌లోని ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు

ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు. కచ్చితంగా సస్పెండ్‌ చేస్తారని తెలిసే ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తూ ఇప్పుడు రాజీనామా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని చెప్పారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నందున సాధారణంగా ఈ సమయంలో అనర్హత వేటు వేయరని భావించే డెడ్‌లైన్‌ పెట్టి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే మరో రెండు నెలలు వేచిచూస్తే ఏం జరుగుతుందో తెలుస్తుందని, మరోసారి పార్లమెంటులో ఆయన అడుగుపెట్టలేరని ఎంపీ భరత్‌ వాఖ్యానించారు.

ఇదీ చదవండి:

Ready for Cockfights at AP: సంక్రాంతి బరికి సిద్ధమైన పందెం కోళ్లు.. 6 నెలల ముందు నుంచే శిక్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.