అమర్‌నాథ్‌లో మంచులింగం దర్శనం కోసం తీర్థయాత్రకు వెళ్లి అక్కడ ఆకస్మిక వరదల్లో చిక్కుకుని మృతి చెందిన.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు మహిళల మృతదేహాలను అధికారులు స్వస్థలానికి తరలించే ఏర్పాట్లు చేశారు. నగరంలోని టి.నగర్ ప్రాంతానికి చెందిన గునిశెట్టి సుధ(48), అన్నపూర్ణమ్మపేటకు చెందిన కొత్త పార్వతి(56) అమర్‌నాథ్‌కు వెళ్లి వరద విపత్తులో చిక్కుకుని మృతిచెందారు.
సుధ మృతదేహాన్ని దిల్లీ నుంచి సోమవారం రాత్రి విమానంలో విశాఖకు, అక్కడి నుంచి అంబులెన్సులో మంగళవారం ఆమె నివాసానికి తీసుకొచ్చారు. పార్వతి కూడా మృతిచెందినట్లు మంగళవారం అధికారులు ధ్రువీకరించారు. ఆమె మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు.
ఇవీ చూడండి: