ETV Bharat / city

ఆ ఓడ... కదిలే మహానగరం..!

అక్కడ కేసినోల్లో ఆడుకోవచ్చు. నచ్చిన హోటల్లో తినొచ్చు. పిల్లలతో సరదాగా గడపొచ్చు. వాటర్‌పార్కులో, ఉద్యానవనంలో సేదతీరొచ్చు. కోరుకున్న సినిమా చూడొచ్చు... మొత్తంగా ఓ నగరంలో ఎలా తిరగొచ్చో అక్కడా అంతే ఆనందంగా గడపొచ్చు. కాకపోతే ఈ నగరం కదులుతూ కొత్త ప్రదేశాలన్నీ తిప్పుకొస్తుంది. దాని పేరే సింఫనీ ఆఫ్‌ ద సీస్‌... సాగరుడి ఒడిలో కదిలే సుందర నగరం... ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ.

author img

By

Published : Oct 21, 2019, 2:16 PM IST

symphany-of-the-seas-ship-looking-like-city

రాయల్‌ కరీబియన్‌ ఇంటర్నేషనల్‌... ప్రపంచంలోనే అతి పెద్ద క్రూయిజ్‌ కంపెనీల్లో ఒకటి. నార్వేకి చెందిన ఈ సంస్థ అనేక భారీ ఓడల్ని తయారుచేస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటనల్ని నిర్వహిస్తుంటుంది. అందులో భాగంగా రూపొందిన మరో నౌకే ఈ సింఫనీ ఆఫ్‌ ద సీస్‌. ఇప్పటివరకూ వచ్చిన అతి పెద్ద ఓడల్లోకెల్లా ఇదే పెద్దది. 2,28,021 టన్నుల భారీ నిర్మాణమిది. 1,184.42 అడుగుల పొడవు ఉన్న ఈ ఓడమీద 18 డెక్‌లూ 24 స్విమ్మింగ్‌పూల్సూ ఉన్నాయి. 2,759 క్యాబిన్లతో తయారైన ఈ ఓడలో మొత్తం 6,680 మంది ప్రయాణికులు హాయిగా విహరించవచ్చు.

ఆ ఓడ... కదిలే మహానగరం..!
ఆ ఓడ... కదిలే మహానగరం..!

ఏమేం ఉన్నాయో తెలుసా!
అన్ని వసతులతో కూడిన సూట్‌లతోబాటు అచ్చంగా ఓడలోనే వినోదాన్ని పంచే అనేక విభాగాలను ఏర్పాటుచేయడం సింఫనీ ఆఫ్‌ ద సీస్‌ ప్రత్యేకత. గేమ్‌జోన్‌లూ, ఆక్వాథియేటర్‌లూ, సర్ఫింగూ స్లైడర్లతో కూడిన వాటర్‌ పార్కూ, బాస్కెట్‌బాల్‌ కోర్టూ ఇండోర్‌ ఐస్‌ స్కేటింగూ, 43 అడుగుల ఎత్తున్న రాక్‌ క్లైంబింగ్‌ వాల్సూ... ఇలా అన్ని రకాల ఆటలతో కాలక్షేపం చేయవచ్చు. ప్రధానంగా ఇక్కడి ఆక్వా థియేటర్‌లో ఒలింపిక్స్‌ స్థాయి క్రీడాకారులు చేసే విన్యాసాలు సందర్శకుల్ని కళ్లు తిప్పుకోనీయవు.

ఆ ఓడ... కదిలే మహానగరం..!
ఆ ఓడ... కదిలే మహానగరం..!
అసలు మనం నగరంలో ఉన్నామా!ఓడలోని వీధుల్లో నడుస్తూ అక్కడ ఉన్న రెస్టరెంట్లను చూస్తే మనం ఓడలో ఉన్నామా... లేక నగర వీధుల్లో ఉన్నామా అన్నది ఓ పట్టాన అర్థం కాదు. అవును మరి, ఒకటా రెండా 22కి పైగానే హోటల్స్‌ ఉన్నాయక్కడ. వీటికి తోడు జెడ్‌ జనరేషన్‌ కోసం అన్నట్లు సీ ఫుడ్‌ రెస్టరెంట్‌, స్పోర్ట్స్‌ బార్‌, రకరకాల ఐస్‌క్రీమ్‌లూ స్వీట్లతో నిండిన షుగర్‌ బీచ్‌, ఎల్‌ లొకొ ఫ్రెష్‌... వంటి మెక్సికన్‌ ఈటరీ స్టాల్స్‌నీ ఏర్పాటుచేశారు. ఇక, ఓడలో ఉండే డైనింగ్‌ హాళ్లు షరా మామూలే. ఇవన్నీ అలా ఉంచితే, ఓడకి మధ్య భాగంలో ఓ అందమైన ఉద్యానవనం కూడా ఉంది. అందులో 20 వేల రకాల మొక్కల్ని పెంచుతున్నారు. దానికి పక్కనే ఉన్న కెఫెలూ స్నాక్‌ పాయింట్స్‌లో కోరిన రుచుల్ని తింటూ ఆ పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. ఇక, రాయల్‌ థియేటర్‌, స్టూడియో బి... వంటి సినిమా హాళ్లకీ కొదవ లేదు. సినిమాలతో బాటు పాప్‌, రాక్‌ మ్యూజిక్‌ను ప్రదర్శించే వేదికలూ ఉన్నాయి. ఇవేవీ వద్దు కేసినోలే కావాలనుకునే సరదారాయుళ్లకి లాస్‌వేగాస్‌నే మరిపించే కేసినో సెంటర్లూ ఉన్నాయి. కాన్ఫరెన్స్‌ హాళ్లూ జిమ్‌లూ స్పాలూ పబ్‌లూ క్లబ్‌హౌస్‌లూ లాంజ్‌లూ షాపింగ్‌ సెంటర్లూ... షరా మామూలే. రోబోలే ఆర్డర్‌ తీసుకుని డ్రింక్స్‌ని అందించే బయోనిక్‌ బార్‌ గమ్మత్తైన అనుభూతిని కలిగిస్తుంది.
ఆ ఓడ... కదిలే మహానగరం..!
ఆ ఓడ... కదిలే మహానగరం..!
అక్కడో యూత్​జోన్​ ఉందిక్రీడల్లో మునిగితేలే తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిశ్చింతగా వదిలేందుకు యూత్‌జోన్‌ ఉండనే ఉంది. అక్కడ చిన్న పిల్లల నుంచి టీన్స్‌ వరకూ అందరూ కొత్త స్నేహితులతో ఆడిపాడుతుంటారు. రాత్రిపూట మెరిసేలా నియాన్‌ పెయింట్‌ వేసిన మేజ్‌ రూమ్‌ గేమ్స్‌ నుంచి పిల్లలు ఓ పట్టాన బయటకు రారు. మొత్తంగా రాయల్‌ కరీబియన్‌... పిల్లల్నీ పెద్దల్నీ అలరించే ఓ అమ్యూజ్‌మెంట్‌ నగరం అనడంలో సందేహం లేదు.
ఆ ఓడ... కదిలే మహానగరం..!
ఆ ఓడ... కదిలే మహానగరం..!

స్నానం చేస్తూ.. టీవీ చూడొచ్చు!
నారింజ, పసుపు, ఆక్వా నీలం, గులాబీ, ఎరుపు... వంటి ప్రకాశవంతమైన రంగుల్లో డిజైన్‌ చేసిన అల్టిమేట్‌ ఫ్యామిలీ సూట్‌ ఈ ఓడకే ప్రధాన ఆకర్షణ. పిల్లలు ఆడుకునేందుకు వీలుగానూ రూపొందించిన ఈ రెండంతస్తుల సూట్‌లో అన్ని రకాల వసతి సౌకర్యాలూ ఉన్నాయి. డైనింగ్‌రూమ్‌, హాలూ, లివింగ్‌ రూమ్‌, నాలుగు బెడ్‌రూమ్‌లతో ఓ డూప్లెక్స్‌ ఇంటిని తలపించే ఈ సూట్‌ బాల్కనీలోంచి సాగర అందాల్నీ వీక్షించవచ్చు. పిల్లల ఆటలకోసం విర్ల్‌పూల్‌ టబ్స్‌, టేబుల్‌ టెన్నిస్‌ బోర్డూ, జారుడు బల్లలూ, ఉయ్యాలలూ, వాటర్‌ వాల్స్‌, ఎయిర్‌ హాకీ, మినీ గోల్ఫ్‌కోర్సూ, పింగ్‌ పాంగ్‌ టేబులూ, లెగో వాల్‌, పెద్ద చాక్‌బోర్డూ, బోర్డు గేమ్‌లూ... ఇలా సకల హంగుల్నీ ఏర్పాటు చేయడం విశేషం. హాల్లోని 85 అంగుళాల టీవీ స్క్రీన్‌లో సినిమా చూస్తూ మధ్యమధ్యలో పక్కనే ఉన్న పాప్‌కార్న్‌ మేకర్‌లో తాజా పాప్‌కార్న్‌ తయారుచేసుకుని, కోక్‌ మెషీన్‌ నుంచి కోక్‌ నింపుకుంటూ ఎంజాయ్‌ చేయవచ్చు. పిల్లలకోసం ఏర్పాటుచేసిన బంక్‌బెడ్‌లకీ ప్రత్యేకంగా టీవీ అమర్చి ఉంటుంది. చివరికి బాత్‌రూమ్‌లో స్నానం చేస్తూ కూడా టీవీ చూడొచ్చు.

ఆ ఓడ... కదిలే మహానగరం..!
ఆ ఓడ... కదిలే మహానగరం..!
సదా మీ సేవలోమొత్తంగా ఎనిమిదిమంది కోసం డిజైన్‌ చేసిన ఈ ఫ్యామిలీ సూట్‌లో సదా మీ సేవలో అన్న రీతిలో రాయల్‌ జెనీ పేరుతో ఓ పర్సనల్‌ అటెండరూ ఉంటాడు. ఓ వారం రోజులపాటు ఈ సూట్‌లో పర్యటించాలంటే పర్యటకుల రద్దీని బట్టి 28 నుంచి 60 లక్షల రూపాయల ధర ఉంటుంది. ఫ్లోరిడా నుంచి తూర్పు, పశ్చిమ కరీబియన్‌ ప్రాంతాలైన ఫిల్స్‌బర్గ్‌, సెయింట్‌ మార్టెన్‌, ప్యుయర్టో రికో, హైతీ, బహమాస్‌ ప్రాంతాల్లో పర్యటించే ఈ నౌక, ఉత్తమ అతి పెద్ద క్రూయిజ్‌ నౌకగానూ అవార్డును గెలుచుకుంది.
ఆ ఓడ... కదిలే మహానగరం..!
ఆ ఓడ... కదిలే మహానగరం..!
ఎన్నో ఉత్తమ బహుమతులు!గతంలో తయారైన ఓడల్లో ఎదురైన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని అవేవీ లేకుండా పూర్తిగా ప్రయాణికుల సౌకర్యాన్నీ పర్యావరణాన్నీ దృష్టిలో పెట్టుకుని మరీ ఈ విలాసవంతమైన అతిపెద్ద ఓడను రూపొందించారట. అందుకే ప్రారంభమై ఏడాది కూడా నిండకముందే విభిన్న కేటగిరీల్లో ఉత్తమ బహుమతుల్ని సొంతం చేసుకోవడంతోబాటు ఓడలో అడుగుపెట్టిన అందరి మనసుల్నీ దోచుకున్న ఘనత ఒక్క సింఫనీ ఆఫ్‌ ద సీస్‌కి మాత్రమే దక్కింది. అందుకే ‘కడలి కెరటాలమీద పరుగులు తీసే సుందర నగరం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ల్లోనూ దానిమీద తెగ పోస్టులు పెట్టేస్తున్నారు పర్యటకప్రియులు!

ఇదీ చదవండి:ప్రతి రాత్రి వారి నిద్ర శ్మశానంలోనే.. ఎందుకంటే..?

Intro:Body:

taza

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.