ప్రిన్స్ మహేష్‌బాబు 45వ జన్మదినం సందర్భంగా రాజమహేంద్రవరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్ సేవా సమితి, తనూజ్ ఫ్రెండ్స్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో జరిపారు. నిరాశ్రయులు, అనాథలకు శానిటైజర్లు, మాస్కులు, విటమిన్ ట్యాబ్లెట్లు అందజేశారు. అనంతరం అన్నదానం చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలు అందించడం అభినందనీయమని పలు సేవా సంస్థల ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి :