ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేయడం, చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన ముగ్గురిపై రాజమహేంద్రవరం బొమ్మూరు పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి... నోటీసులు జారీ చేశారు. రాజమహేంద్రవరంలో గత నెలలో ఎంపీ మార్గాని భరత్, మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఇతర ప్రజా ప్రతినిధులు పేదలకు కిట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు వచ్చాయి. వీరిపై చర్యలు తీసుకోవాలని ఎంపీ భరత్ సహాయకులు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు ముగ్గురిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందని ఉండవల్లి అనూష, తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరికి చెందిన విశ్వేశ్వరప్రసాద్, రాజమహేంద్రవరానికి చెందిన నరేంద్రకుమార్‌కు నోటీసులు జారీ చేసినట్లు.. మూడు రోజుల్లో హాజరుకాని పక్షంలో చర్యలు తీసుకుంటామని బొమ్మూరు సీఐ లక్ష్మణరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: