ETV Bharat / city

రేపు రాజమహేంద్రవరంలో మెగా జాబ్​ మేళా - rajamundry mega job mela news in telugu

రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో రేపు నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ మార్గాని భరత్​ కోరారు. ఈ జాబ్ మేళాలో 30 నుంచి 40 కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. సుమారు 16 వందల మందికి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

మెగా జాబ్​ మేళా గురించి వివరిస్తున్న ఎంపీ మార్గాని భరత్​

author img

By

Published : Feb 17, 2020, 1:05 PM IST

మెగా జాబ్​ మేళా గురించి వివరిస్తున్న ఎంపీ మార్గాని భరత్​

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో రేపు మెగా జాబ్​ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ మార్గాని భరత్​ రామ్​ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి నైపుణ్య సామర్థ్యాన్ని పెంచే శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈ విషయమై గతంలో ఆనం కళాకేంద్రంలో అవగాహన కల్పించామన్నారు. ఈ జాబ్ మేళాలో 30 నుంచి 40 కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. సుమారు 16 వందల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ద్వారా అనేక ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలను తీర్చిదిద్దే విధంగా ఒక గొప్ప ఆర్ట్స్ యూనివర్సిటీగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.