తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, రాజానగరం నియోజకవర్గాల్లో పునరుద్ధాన పండుగ (ఈస్టర్)ను క్రైస్తవులు భక్తి, శ్రద్ధలతో నిర్వహించారు. యేసు ప్రభువు సమాధి నుంచి మూడో రోజు సజీవుడిగా లేచిన పర్వదినాన్ని ఈస్టర్ పండుగగా నిర్వహించుకుంటారు. తెల్లవారుజామునే ఆత్మీయుల సమాధుల వద్దకు చేరుకున్నారు. పూలతో అలంకరించి, కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఇదీ చదవండి.... అన్నవరం దేవస్థానానికి 'ఐఎస్ఓ' గుర్తింపు