తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సీతాఫలం అంటే జిల్లా వాసులకు నోరూరుతుంది. దివాన్ చెరువులో సాగయ్యే సీతాఫలాలు... విశాఖ, అమరావతి, విజయవాడతో పాటు ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి అవుతుంటాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ ఫలాలు ఎక్కువగా లభిస్తాయి. ఈ ఏడాది సీతాఫలాల మొదటి విడతకాపు సాధారణంగా ఉన్నా... అనంతరం కురిసిన భారీ వర్షాలు పంటనష్టం వచ్చిందని రైతులు అంటున్నారు.
రియల్ ఎస్టేట్‌తో రైతుల్లో ఆందోళన...
సీతాఫలం కాపు సమయంలో... రైతులతో పాటు, బుట్టలు కట్టే వారికి ఉపాధి లభించేది. కానీ మారుతున్న జీవన శైలి కారణంగా బుట్టల స్థానంలో ప్లాస్టిక్ పెట్టెలు వచ్చాయి. వీటి రాకతో ఈ పంటపై ఆధారపడేవారికి సంఖ్య తగ్గింది. సీతాఫల్ చెట్ల పెంపకానికి రియల్ ఏస్టేట్స్ రంగం ఓ సమస్యగా మారింది. చెట్లు నరికి... స్థలాలు పూడ్చి ప్లాట్లుగా మారుస్తున్నారు. రాజమహేంద్రవరం పట్టణానికి సమీపంలో ఉండడం కారణంగా... భూముల విలువ పెరిగింది. రియల్ ఏస్టేట్ రంగం పుంజుకొని... సీతాఫలం సాగు క్రమేపి తగ్గిపోయిందని దివాన్ చెరువు రైతులు అంటున్నారు.
ఈ కారణాలతో తూర్పుగోదావరి జిల్లా వాసులకు కమ్మని రుచులు అందించే... దివాన్ చెరువు సీతాఫలం భవిష్యత్తులో ఉంటుందా అనే సందేహాన్ని రైతులు, స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా... జిల్లా వాసులకు తియ్యని రుచినందిస్తోన్న సీతాఫలాలు తినాలంటే ఓసారి దివాన్ చెరువు వెళ్లాల్సిందే.
ఇదీ చదవండి :