VIRASAM MAHA SABHALU: దోపిడీ, నియంతృత్వ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడుతామని విరసం నేతలు ప్రకటించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో జరుగుతున్న విరసం మహాసభలు రెండో రోజు కొనసాగాయి.
ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలు రచయితలు హాజరయ్యారు. సంస్కృతి, మార్క్సిజంపై మహాసభలో చర్చించారు. విరసం ఏపీ అధ్యక్షుడిగా అరసవిల్లి కృష్ణ, కార్యదర్శిగా రివేరాలతోపాటు ఆరుగురు సభ్యులను ఎన్నుకున్నారు.
virasam kalyan rao: ప్రజలను చైతన్యం చేసే రచయితలను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని విరసం నేత కళ్యాణ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హిందుత్వ వాదాన్ని భాజపా ప్రోత్సహిస్తోందని విమర్శించారు.
ఇదీ చదవండి:
FAMILY SUICIDE: నిజామాబాద్ వాసుల ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే ?