తెదేపా అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లాలో నేడు రెండో రోజు సమీక్షలు నిర్వహించనున్నారు. మొదటి రోజు నాలుగు నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీ అయ్యారు. వారి సమస్యలను ఓపికగా విన్నారు. ఒక్కొ నియోజకవర్గానికి రెండు గంటలకు పైగా సమయం కేటాయించారు. అధికార పార్టీ నేతలు తమ పై తప్పుడు కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఉదయగిరి, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేశారు. ఇవాళ ఆరు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమీక్షలు జరపనున్నారు.
ఇదీ చదవండి: జగన్మోహన్రెడ్డి... జగన్నాటకాలు వద్దు!